సీఐఐ (TS) అధ్యక్షునిగా నాగిష్ దీక్షిత్
2022-23 సంవత్సరానికి భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ విభాగ చైర్మన్‌గా వాగిన్ దీక్షిత్ ఎన్నికయ్యారు. ALPLA ఇండియా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన దీక్షిత్ ALPLA వరల్డ్ వైడ్ చీఫ్ ఇంజినీరింగ్ ఆఫీసర్‌గా కూడా పనిచేస్తున్నారు. 2021-22లో ఈయన సీఐఐ తెలంగాణకు వైస్ చైర్మన్‌గా వ్యవహరించారు. ఇప్పటి వరకు కోరమాండల్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన సమీర్ గోయెల్ స్థానంలో దీక్షిత్ ఎన్నికయ్యారు. ఇక సీఎస్ఆర్ ఎస్టేట్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి. శేఖర్ రెడ్డి వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకూ ఈయన సీఐఐ తెలంగాణ రియల్ ఎస్టేట్ , ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యానెల్లో కన్వీనర్‌గా కొనసాగారు.