MID SESSION: కీలన స్థాయిలో నిఫ్టి
యూరోపియన్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టంతో ప్రారంభమయ్యాయి. నిన్న మన మార్కెట్లకు సెలవు కావడంతో… నిన్నటి నష్టాలను కూడా మార్కెట్ ఇవాళ డిస్కౌంట్ చేస్తోంది. దీంతో ఇవాళ 16,478 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. అయితే అక్కడి నుంచి కోలుకున్న నిఫ్టి ఇపుడు 16,532 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 261 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టి భారీ నష్టాలు .. నిఫ్టిని తీవ్రంగా దెబ్బతీశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ లూజర్స్‌లో ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మినహా మిగిలిన బ్యాంక్ నిఫ్టి షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టి 3 శాతం కంటే అధిక నష్టంతో ట్రేడవుతోంది. యూరో మార్కెట్లు ఏమాత్రం కోలుకున్నా… నిఫ్టి కూడా ఆ మేరకు కోలుకునే అవకాశముంది. అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లోకి రావడం విశేషం.