ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్ళు ఓకే
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.3 లక్షల కోట్లను దాటయి. ఈ స్థాయిలో జీఎస్టీ వసూళ్ళు రావడం ఇది అయిదో సారి. జనవరిలో రూ. 1.38 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్ళు కాగా, ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గి 1.33 లక్షల కోట్లకు చేరాయి. గీ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే 18 శాతం ఎక్కువే. తాజా జీఎస్టీ వసూళ్ళలో కేంద్ర జీఎస్టీ (CGST) రూ .24,435 కోట్లు కాగా .. రాష్ట్రాల జీఎస్టీ (SGST) రూ .30,779 కోట్లు . ఉమ్మడి జీఎస్టీ (IGST) కింద రూ.67,471 కోట్లు (దిగుమతులపై వసూలు చేసిన రూ .33,837 కోట్లతో కలిపి) ఉన్నాయి. తొలిసారి సెస్ రూపంలో వసూలు చేసిన మొత్తం రూ. 10 వేల కోట్లను దాటి రూ.10,340 కోట్లకు చేరింది.