For Money

Business News

రష్యాలో హాలివుడ్ మూవీల రిలీజ్‌ బంద్

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాలో కొత్త సినిమాలు విడుదల చేయరాదని హాలివుడ్‌ స్టూడియోలు నిర్ణయించారు. తాజాగా విడుదలైన ‘ద బ్యాట్‌మన్‌’ మూవీని రష్యాలో విడుదల చేయడం లేదని వార్నర్‌ బ్రదర్స్‌ పేర్కొంది. గత శక్రవారం భారత్‌తో సహా ప్రపంచ దేశాల్లో ‘ద బ్యాట్‌మన్‌’ మూవీ విడుదలైంది. ‘స్పైడర్‌ మ్యాన్‌’ మూవీ ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. ఈ మూవీని కూడా తాము రష్యాలో విడుదల చేయడం లేదని సోని ప్రకటించింది. ఇక డిస్నీ స్టూడియోస్‌ కూడా పిక్సర్‌ బ్యానర్‌ కింద తీసిన ‘టర్నింగ్‌ రెడ్‌’ మూవీని రష్యాలో విడుదల చేయడం లేదని వెల్లడించింది. ఈనెల 10వ తేదీన ఈ సినిమా అమెరికాలో నేరుగా డిస్నీ ప్లస్‌లో విడుదల అవుతోంది. పరిస్థితిని బట్టి భవిష్యత్‌ సినిమాల విడుదలపై నిర్ణయం తీసుకుంటామని హాలివుడ్‌ స్టూడియోలు అంటున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌ దేశస్థులను, ఇతర దేశాలకు తరలి వెళ్ళిన ఆ దేశస్థులన ఆదుకోవడానికి వివిధ ఎన్‌జీవోలతో కలిసి పనిచేస్తున్నట్లు హాలివుడ్‌ స్టూడియోలు తెలిపాయి.