For Money

Business News

గ్రీన్‌లో ఆసియా మార్కెట్లు

రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిసినా… ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ, తైవాన్‌ సూచీలు 1.5 శాతంపైగా లాభంతో ఉండగా, న్యూజిల్యాండ్‌ సూచీ 2.6 శాతం లాభంతో ట్రేడవుతోంది. చైనా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ సూచీ స్థిరంగా ఉంది. ఎలాంటి మార్పు లేదు. అమెరికా ఫ్యూచర్స్‌లో కూడా ఎలాంటి మార్పు లేదు. చాలా వరకు ఆసియా యుద్ధం తాలూకు పర్యవసానాలను బేరీజు వేస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల బాగా లబ్ది పొందే మార్కెట్లలో చైనా కూడా ఉంది. కాని ఆ మార్కెట్ స్థిరంగా ఉండటం విశేషం. మరి యూరో మార్కెట్లు ఎలా స్పందిస్తాయో చూడాలి. మరోవైపు డాలర్‌, ఆయిల్‌, బులియన్‌ లాభాలతో ట్రేడవుతున్నాయి.