For Money

Business News

ట్రూకాలర్‌తో తాన్లా జట్టు

సీపాస్‌ (కమ్యూనికేషన్స్‌ ప్లాట్‌ఫాం యాజ్‌ ఎ సర్వీస్‌) దిగ్గజం తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ తాజాగా ట్రూకాలర్‌తో జట్టు కట్టింది. ట్రూకాలర్‌ బిజినెస్‌ మెసేజింగ్‌కు తమ వైజ్‌లీ సీపాస్‌ ప్లాట్‌ఫామ్‌ సర్వీసులు అందించనుంది. బార్సెలోనాలో జరుగుతున్న మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ 2022 సందర్భంగా ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకుంది. సాంప్రదాయ ఎస్‌ఎంఎస్‌ సర్వీసులకు భిన్నంగా సందేశాలను వేగవంతంగా, చౌకగా డెలివరీ చేసేందుకు ఈ డీల్‌ తోడ్పడుతుంది. 30 కోట్ల మందికిపైగా వినియోగదారులు ట్రూకాలర్‌ను వినియోగిస్తున్నారు. వ్యాపార సంస్థలు తమ వినియోగదారులకు మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు తదితరాలు చేరవేసేందుకు ఆధునిక మెసేజింగ్‌ సౌకర్యాన్ని ట్రూకాలర్‌ అందిస్తోంది. వ్యాపార సంస్థలు తమ యూజర్లకు పర్సనలైజ్డ్‌ సందేశాలను సురక్షితంగా అందించడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడగలదని తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ చైర్మన్‌ ఉదయ్‌ రెడ్డి తెలిపారు.