గ్యాస్‌పై భారీ బాదుడు
దేశంలో గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ సంస్థలు షాకిచ్చాయి. కమర్షియల్ గ్యాస్ ధరను రూ. 105 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో ప్రస్తుతం 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,012కు చేరింది. సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపాయి. అలాగే 5 కేజీ సిలిండర్ ధర రూ. 27 పెరిగింది. గ్యాస్ ధరలు పెరుగుతాయని గత కొన్ని రోజులుగా మీడియాకు లీకులు ఇస్తున్న చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ ధరల పెంపును ప్రకటించాయి.
ఇంటిగ్యాస్‌పై కూడా…
వంట గ్యాస్ ధరలను కూడా చమరు మార్కెటింగ్ కంపెనీలు పెంచే అవకాశముంది. ప్రతి నెలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ ధరల విషయంలో రివ్యూ మీటింగ్ చేపడుతుంటాయి. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంలో ఎల్‌పీజీ, నేచురల్ గ్యాస్ ధరలు పెరగనున్నాయని పలు నివేదికలు ప్రజలను ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి. కమర్షియల్ ధరలను ఇవాళ్టి నుంచి పెంచిన కేంద్రం… అసెంబ్లీ ఎన్నికల తరవాత ఇంటి గ్యాస్ ధర పెంచుతుందా లేదా ఇవాళ పెంచుతుందా అన్నది చూడాలి. ఈసారి గ్యాస్ ధర సిలిండర్ ధర రూ.100 నుంచి 200 వరకు పెరుగుతుందని వార్తలు వస్తున్నాయి,