For Money

Business News

సెబి ఛైర్‌పర్సన్‌గా మాధవి పురి

స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ అయిన సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి) ఛైర్ పర్సన్‌గా మాధవి పురి బచ్‌ను నియమించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఆమె మూడేళ్ళపాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో ఆమె సెబీలో హోల్ టైమ్‌ సభ్యురాలిగా పనిచేశారు. టెక్నాలజీపై ఏర్పాటు చేసిన కమిటీలో కూడా సభ్యురాలిగా పనిచేశారు. ఫైనాన్షియల్‌ మార్కెట్‌లో దాదాపు మూడు దశ్దాల అనుభవం ఉన్న మాధవి  పురి 2017 ఏప్రిల్‌ 5 నుంచి 2021 అక్టోబర్‌ 4 వరకు ఆమె సెబిలో పూర్తి కాలపు సభ్యురాలిగా పనిచేశారు. ఇంతకుమునుపు ఈమె ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈఓగా పనిచేశారు.