For Money

Business News

రష్యాలో వడ్డీ రేట్లు భారీగా పెంపు

ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. మాస్కో స్టాక్‌ ఎక్స్ఛేంజీ సూచీ సగానికి పడిపోయింది. మరోవైపు విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌ (ఫారెక్స్‌)లో ఇతర కరెన్సీలతో పోలిస్తే రష్యా కరెన్సీ రూబుల్‌ కూడా భారీగా క్షీణించింది. దీంతో రష్యాలో ద్ర్యవ్యోల్బణం భారీగా పెరగనుంది. అలాగే యుద్ధం కారణంగా భారీ ఖర్చు. పొదుపు మొత్తాలకు విలువ లేకుండా పోతోంది. దీంతో రష్యా సెంట్రల్‌ బ్యాంక్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 9.5 శాతం నుంచి 20 శాతానికి పెంచింది. దీంతో ప్రజల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లను సేకరించాలని నిర్ణయించింది.అలాగే విదేశాలకు ఎగుమతులు చేయడం ద్వారా భారీ మొత్తం విదేశీ కరెన్సీ సంపాదిస్తున్న కంపెనీలు…తమ వద్ద ఉన్న విదేశీ కరెన్సీలను అమ్మాలని రష్యా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆదేశించింది. రష్యా రూబుల్‌ మరింత పతనం కాకుండా కాపాడాలని పేర్కొంది. సెంట్రల్ బ్యాంక్‌తో పాటు ఆర్థిక శాఖ కూడా కంపెనీలపై ఒత్తిడి తెస్తోంది. తమ ఎగుమతుల ద్వారా వచ్చే విదేశీ కరెన్సీల్లో 80 శాతాన్ని అమ్మి… రూబుల్‌ను కాపాడాలని ఆదేశించింది. అమెరికా, యూరప్‌ దేశాల ఆంక్షల కారణంగా ఆర్థికంగా రష్యా తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ సమయంంలో కరెన్సీని, స్టాక్‌ మార్కెట్లను కాపాడుకోవడానికి రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.