పాన్ అప్డేషన్కు లాస్ట్ డే
ఎల్‌సీఐ మెగా పబ్లిక్ ఆఫర్ మార్చి నెలలో రానుంది. ఈ ఆఫర్లో యాంకర్ ఇన్వెస్టర్లు, సంస్థాగత ఇన్వెస్టర్ల కోటా పోను రీటైల్ ఇన్వెస్టర్టలకు 35 శాతం షేర్లను మాత్రమే కేటాయిస్తారు. ఇందులో మళ్ళీ పది శాతం పాలసీ హోల్డర్స్‌కు, మరో అయిదు శాతం ఎల్ఐసీ ఉద్యోగులకు కేటాయిస్తున్నారు. ఎల్ఐసీ పాలసీ హోల్డర్ల జాబితాలో మీకు అర్హత ఉండాలంటే మీ దగ్గర ఉన్న పాలసీ ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీ లోపల తీసుకున్నదై ఉండాలి. అలాగే సదరు ఎల్ఐసీ పాలసీకి పాన్ నంబర్‌ను పాలసీదారుడు లింక్ చేయాలి. పాన్ లింక్ చేయడానికి ఇవాళే చివరి తేదీ. లింక్ చేయకపోతే ఈ కోటాలో షేర్లకు దరఖాస్తు చేసుకునే వీలు లేదు.ఒకవేళ డిస్కౌంట్ ఇస్తే… అది పొందడానికి వీలుండదు. కాబట్టి పాలసీదారులు తమ పాన్ నంబర్ లింక్ అయి ఉందో లేదో ఓసారి చెక్ చేసుకోవడం మంచిది. లేకుంటే ఇవాళే లింక్ చేయండి. దీని కోసం మీరు ఎల్ఐసీ వెబ్‌సైట్‌కు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది లింక్…linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus. ఈ లింక్ ఓపెన్ చేసిన తరవాత మీ ఎల్ఐసీ పాలసీ నంబర్ ఎంటర్ చేయండి. అలాగే మీ పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తరవాత పాన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. అక్కడ ఇచ్చిన క్యాప్చా (CAPTCHA)ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తరవాత సబ్మిట్ బటన్ నొక్కితే పాన్ నంబర్ లింక్ అవుతుంది. స్టేటస్ మీ కంప్యూటర్‌పై కన్పిస్తుంది. లేదా మీ మొబైల్ నంబర్ స్క్రీన్‌పై కన్పిస్తుంది.