For Money

Business News

నిఫ్టి: సూపర్‌ రికవరీ

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధనేపథ్యంలో ఓపెనింగ్‌లో భారీగా క్షీణించిన నిఫ్టి కేవలం రెండు గంటల్లో కోలుకుంది. అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లో ఉన్నా… నిఫ్టి ఇవాళ్టి కనిష్ట స్థాయి 15,356 నుంచి 16,599కి కోలుకుంది. కేవలం 58 పాయింట్ల నష్టంతో నిఫ్టి ట్రేడవుతోంది. దీనికి ప్రధాన కారణం మెటల్స్‌కు వచ్చిన మద్దతు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌, ఆంక్షల కారణంగా రష్యా నుంచి మెటల్స్‌ దిగుమతులు తగ్గుతాయని.. దీంతో భారత్‌లోని కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతుందని భావిస్తున్నారు. నిఫ్టిలో టాప్‌ గెయినర్స్‌గా హిందాల్కో, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ఉన్నాయి. నిఫ్టి 31 షేర్లు నష్టాల్లో ఉన్నా… ఈరంగానికి చెందిన షేర్లలో గట్టి మద్దతు రావడంతో నిఫ్టి చాలా వరకు నష్టాలను రికవర్‌ చేసుకుంది. బ్యాంక్‌, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో మాత్రం ఒత్తిడి కొనసాగుతోంది.