For Money

Business News

16500 దిగువన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి కన్నా భారీ నష్టాలతో నిఫ్టి ప్రారంభమైంది. ప్రస్తుతం నిఫ్టి 16,459 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 198 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. మిడ్ క్యాప్‌ నిఫ్టితో పాటు ఇతర సూచీలన్నీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. గత శుక్రవారం కోలుకున్న అనేక షేర్లు ఇవాళ నష్టపోయాయి. నిఫ్టిలో కేవలం ఓఎన్‌జీసీ, హిందాల్కో మాత్రమే గ్రీన్‌లో ఉన్నాయి. ఇవి కూడా నామ మాత్రపు లాభాలే. ఇక నష్టాల్లో టాటా మోటార్స్‌ టాప్‌లో ఉంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 2 శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ భారీ నష్టాలతో ఉండటంతో ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో కొనుగోళ్ళకు జంకుతున్నారు. పైగా ఎల్‌ఐసీ ఐపీఓలో ఇన్వెస్ట్‌ చేయాలని భావిస్తున్న ఇన్వెస్టర్లు కూడా ఇపుడు లాభాలు స్వీకరిస్తున్నారు. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మిడ్‌ సెషన్‌లోగా నిఫ్టి కోలుకుంటుందా లేదా అన్నది చూడాలి. అలాగే రేపు మహాశివరాత్రి సందర్భంగా మార్కెట్లకు సెలవు కావడంతో… ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే ప్రాధాన్యం ఇవ్వొచ్చు.