నిఫ్టి: నష్టాల గేట్లు తెగాయి
ఇవాళ్టితో నిఫ్టికి ఉన్న దాదాపు అన్ని సపర్ట్లు తెగాయి. టెక్నికల్ అనలిస్టులు ముందే హెచ్చిరించినట్లు నిఫ్టి 16200 స్థాయికి చేరుకుంది. కాని ఇంత ఫాస్ట్‌గా చేరుకుంటుందని వారు కూడా ఊహించలేదు. నిఫ్టిలో ఉన్న దాదాపు అన్ని షేర్లు భారీ నష్టాలతో ముగియడంతో నిఫ్టి 16203 స్థాయిని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 815 పాయింట్ల నష్టంతో నిఫ్టి ముగిసింది. సెన్సెక్స్ 2702 పాయింట్లు పతనమైందంటే అమ్మకాలు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టి దాదాపు 6శాతం వరకు నష్టపోగా, మిడ్ క్యాప్ సూచీ ఆరు శాతంపైగా నష్టపోయింది. నిఫ్టి నెక్ట్స్ 5.63 శాతం క్షీణించింది. చివరిగా ఇవాళ మార్కెట్లో పెరిగిన షేర్లను లెక్కించడం సులభంగా ఉంది.