సింగపూర్ నిఫ్టి షాక్
ఇటీవల ఎన్నడూ లేనివిధంగా సింగపూర్ నిఫ్టి భారీ నష్టాలతో ట్రేడవుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లో క్లోజ్ కావడం, డాలర్‌తో పాటు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో భారత మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడి వస్తోంది. క్రూడ్ అధిక ధరలు కారణంగా గత డిసెంబర్ త్రైమాసికంలో అనేక కంపెనీలు ఫలితాలు దెబ్బతిన్నాయి. ఇపుడు క్రూడ్ ధరలు పెరగడంతో పాటు డాలర్ కూడా పెరుగుతోంది. ఆసియా మార్కెట్లన్నీ రెడ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా హాంగ్‌సెంగ్ సూచీ 1.6శాతంపైగా నష్టంతో ఉండటంతో… మన ఇన్వెస్టర్లలో భయం పెరుగుతోంది. సింగపూర్ నిఫ్టి 270 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 16800 దిగువకు వెళ్ళే అవకాశాలు అధికంగా ఉన్నాయి.