స్థిరంగా వాల్‌స్ట్రీట్
లాభాలతో ప్రారంభమైన వాల్‌స్ట్రీట్ కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఉ్రకెయిన్ దేశ వ్యాప్తంగా ఎమర్జన్సీవిధించడంతో అన్ని సూచీలు రెడ్‌లోకి వెళ్ళాయి. కాని నష్టాలు పెద్దగా లేవు. దీనికి ప్రధాన కారణంగా రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలు పెద్ద సీరియస్‌వి కాకపోవడమే. డౌజోన్స్ దాదాపు క్రితం ముగింపు వద్దే ఉంది. మిగిలిన నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 సూచీలు కూడా 0.4 శాతం లోపు లాభాలతో ఉన్నాయి. డాలర్ కాస్త గ్రీన్‌లో ఉంది. అధిక స్థాయిలో క్రూడ్‌లో కాస్త ఒత్తిడి కన్పిస్తోంది.