NIFTY TODAY: 17,300 కీలకం
నిఫ్టి ఇవాళ ఉదయం వంద పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యే అవకాశముంది. నిన్న నిఫ్టి 17092 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టికి తొలి ప్రతిఘటన 17210 వద్ద ఎదురు కానుంది. ఈ స్థాయి దాటితే 17250 వద్ద ప్రతిఘటన రావొచ్చు. రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలు పసలేనివని మార్కెట్ భావిస్తోంది. యూరో దేశాలు కూడా ఆంక్షలు విధిస్తున్నాయి. కాబట్టి యూరో మార్కెట్లు కూడా ఇవాళ కీలకం. యూరో మార్కెట్లు జాగ్రత్తగా ఉంటే నిఫ్టి తొలి, రెండో ప్రతిఘటన వద్ద ఆగిపోవచ్చు. లేదంటే నిఫ్టి అప్ బ్రేకౌట్‌ను దాటొచ్చు. రేపు ఈ నెల మంత్లి, వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్స్ ఉన్నాయి. కాబట్టి మన మార్కెట్ భిన్నంగా ఉండొచ్చు. ఇవాళ్టి ట్రేడింగ్‌కు లెవల్స్…
అప్ బ్రేకౌట్ 17310
రెండో ప్రతిఘటన 17250
తొలి ప్రతిఘటన 17210
నిఫ్టికి కీలక స్థాయి 17048
తొలి మద్దతు 16975
రెండో మద్దతు 16935