For Money

Business News

లాభాల్లో సింగపూర్ నిఫ్టి…

రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నాస్‌డాక్‌ కన్నా డౌజోన్స్‌ భారీ నష్టాలతో ముగిసింది. ఈ రెండుతో పాటు ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా ఒక శాతంపైగా నష్టాల్లో ముగిశాయి. అయితే రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలు పసలేనివి, రష్యాకు ఆర్థికంగా పెద్దగా దెబ్బతీసేవి కాకపోవడంతో మార్కెట్లు పట్టించుకోలేదు. పైగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇవాళ జపాన్‌ రాజు పుట్టిన రోజు సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఇక ఆసియా మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా గ్రీన్‌లోఉంది. హాంగ్‌సెంగ్‌ అర శాతం లాభంతో ఉంది. సింగపూర్‌ నిఫ్టి సుమారు వంద పాయింట్ల లాభంతో ఉంది. దీంతో నిఫ్టి కూడా ఇవాళ గ్రీన్‌లో ప్రారంభమయ్యే అవకాశముంది.