చుక్కలు చూపుతున్న అదానీ విల్మర్
అదానీ గ్రూప్ షేర్ అనగానే సీలింగ్‌లోనూ కొనుగోలు చేశారు ఇన్వెస్టర్లు. లిస్టింగ్ రోజున ఇష్యూ ధర రూ.230కంటే దిగువకు అంటే రూ. 227ని తాకింది ఈ షేర్. అదే రోజు నుంచి వరుస సీలింగ్స్‌తో 4 రోజుల్లోనే రూ.419కి చేరింది. ఫిబ్రవరి 11 గరిష్ఠ స్థాయికి చేరిన ఈ షేర్‌లో సీలింగ్ లిమిట్ 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గిన వెంటనే అమ్మడం ప్రారంభించారు ఇన్వెస్టర్లు. ఇవాళ ఈ షేర్ రూ. 326 స్థాయిని తాకి రూ. 332 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ చాలా వీక్‌గా ఉండటంతో దిగువ ధరలోనూ కొనుగోలుదారులు తక్కువ సంఖ్యలో ఉంటున్నారు. డెలివరీ శాతం కూడా 25 శాతం లోపే ఉండటంతో… ఈ స్థాయిలో కొనుగోలు చేయొచ్చా? అన్న మీమాంసలో ఇన్వెస్టర్లు ఉన్నారు. డిసెంబర్ క్వార్టర్‌కు ఈ కంపెనీ అద్భుత ఫలితాలు ప్రకటించింది. అయినా ఈ షేర్‌లో భారీ ఒత్తిడి రావడం విశేషం. యాంకర్ ఇన్వెస్టర్లు బయటపడే సమయానికి అంటే మార్చి 8కల్లా ఈ షేర్ పెరుగుతుందేమో చూడాలి.