17200 దిగువన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి కూడా ప్రారంభమైంది. ఆరంభంలోనే నిఫ్టి 17200 దిగువకు చేరింది. ప్రస్తుతం 62 పాయింట్ల నష్టంతో 17,214 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 42 షేర్లు నష్టాల్లో ట్రేడవుతుండగా, 8 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఎల్‌ఐసీ ఐపీఓ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో ఒత్తిడి పెరుగుతోంది. విదేశాల్లో రెండు బ్రాండ్ హక్కులను అమ్మడంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ 1.3 శాతం లాభంతో నిఫ్టి టాప్ గెయినర్‌గా నిలిచింది. ఇక ఇతర సూచీలు కూడా నష్టాల్లో ఉన్నాయి. ఎన్‌బీఎఫ్‌సీ నిఫ్టితో పాటు నిఫ్టి నెక్ట్స్ 05 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి.