నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
ఉక్రెయిన్ యుద్ధ భయాలు మార్కెట్‌ను ఇంకా వెంటాడుతున్నాయి. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడారు. ఈ అనిశ్చితి మధ్య శుక్రవారం అమెరికా మార్కెట్ నష్టాలతో ముగిశాయి. నాస్‌డాక్ అత్యధికంగా ఒక శాతంపైగా నష్టపోయింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా మార్కెట్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.65 శాతం నష్టం, హాంగ్‌సెంగ్ సూచీ 0.7 శాతంతో ట్రేడవుతోంది. చైఆన మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. చైనా A50 సూచీ 0.95 శాతం నష్టంతో ఉంది. సింగపూర్ నిఫ్టి భారీ నష్టాల నుంచి కోలుకుని ఇపుడు 100 పాయింట్ల నష్టంతో ఉంది. యుద్ధ వార్తలకు సూచీలు బాగా స్పందిస్తున్నాయి. నిఫ్టి ఇవాళ నష్టాలతో ప్రారంభం కానుంది.