For Money

Business News

పుతిన్‌తో భేటీకి బైడెన్‌ సిద్ధం?

ఏక్షణమైనా సరే… రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీకి అమెరికా అధ్యక్షుడు జొ బైడెన్‌ సిద్ధంగా ఉన్నారని… అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ వెల్లడిచంఆరు. సీఎన్‌ఎన్‌ టీవీ ఛానల్‌లో ఫేస్‌ ద నేషన్‌ షోలో ఆయన మాట్లాడుతూ… ఉక్రెయిన్‌పై దాడికి రష్యా సిద్ధమౌతోందని అన్నారు. యుద్ధ నివారణ కోసం చేయాల్సిందంతా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా బలగాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దౌత్యపరంగా తాము చేయాల్సినదంతా చేస్తున్నామని బ్లింకెన్‌ అన్నారు. ఏక్షణమైనా, ఏ ఫార్మట్‌లోనైనా… పుతిన్‌తో భేటీకి బైడెన్‌ సిద్ధంగా ఉన్నట్లు తాము తెలిపామని ఆయన చెప్పారు. తమ లక్ష్యం యుద్ధ నివారణే అని చెప్పారు. ఈనెల 12వ తేదీన పుతిన్‌, బైడెన్‌ మధ్య టెలిఫోన్‌ సంభాషణ జరిగిన విషయం తెలిసిందే.