మూడేళ్ళలో 10వేల ఈవీ స్టేషన్లు
రానున్న మూడేళ్ళలో దేశవ్యాప్తంగా 1000 విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ప్రకటించింది. ఇప్పటికే దాదాపు వెయ్యి చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేశామని కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ వి సతీష్ కుమార్ అన్నారు. విద్యుత్ వాహనాల తయారీలో ఆటోమొబైల్ కంపెనీలకు సహకరించడంతోపాటు కస్టమర్లలో విశ్వాసం కల్పించడానికి ఈ విద్యుత్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పలు రాష్ట్రాలు, జాతీయ రహదారుల మధ్య 500 పట్టణాల పరిధిలో ఇండియన్ ఆయిల్ ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు. జాతీయ రహదారులను ఈ-జాతీయ రహదారులుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రహదారి వెంబడి 3000కి పైగా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని సతీష్ కుమార్ పేర్కొన్నారు.