చిత్రను ప్రశ్నించిన సీబీఐ
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణను సీబీఐ ప్రశ్నించింది.
ఎన్‌ఎస్‌ఈలో కొలోకేషన్ సదుపాయాన్ని దుర్వినియోగం చేశారన్న అంశంపై ఆమెను ప్రశ్నించారు. ఎన్‌ఎస్‌ఈలో ట్రేడింగ్‌కు సర్వర్లు ఉంటాయి. ఎన్‌ఎస్‌ఈ భనవంలోనే కొంత మంది ఆఫీసు కేటాయించడం ద్వారా సర్వర్ డేటాను ముందుగానే పొంది.. అక్రమంగా భారీ లాభాలు ఆర్జించారనే ఆరోపణలతో ఓ కేసు నమోదైంది. ఇప్పటికే ఓపీసీ సెక్యూరిటీస్ ప్రమోటర్ సంజయ్ గుప్తా, ఇతరులు ఇలా భారీగా లబ్ది పొందారని కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు చిత్రతో పాటు మరో మాజీ సీఈఓ రవి నారాయణ్, మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌లు దేశం వదిలి వెళ్లకుండా నిరోధించేందుకు వారిపై లుకౌట్ సర్క్యులర్లు కూడా సీబీఐ జారీ చేసింది.