For Money

Business News

సూచీలు స్వల్పంగా… షేర్లు భారీగా పతనం

ఇవాళ కూడా మార్కెట్‌ హెచ్చుతగ్గులతో ముగిసింది. సూచీలు చాలా స్వల్ప నష్టంగా ముగిశాయి. బ్యాంక్‌ నిఫ్టి, ఎన్‌బీఎఫ్‌సీ నిఫ్టి గ్రీన్‌లో ముగిశాయి. మిడ్‌ సెషన్‌లో గ్రీన్‌లో ఉన్న నిఫ్టి… తరవాత వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా 17219 పాయింట్లను తాకింది. చివరలో కాస్త కోలుకుని 17276 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి కేవలం 28 పాయింట్లు నష్టపోయింది. సూచీ స్వల్పంగా నష్టపోయినా.. నిఫ్టిలో 32 షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి తరవాత అదే స్థాయి షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టి నెక్ట్స్‌ సూచీ ఏకంగా ఒక శాతంపైగా నష్టపోయింది. అనేక కీలక షేర్లకు ప్రాతినిధ్యం వహించే మిడ్‌ క్యాప్‌ నిఫ్టి సూచీ కూడా 0.9 శాతం నష్టంతో ముగిసింది. ఉక్రెయిన్‌, రష్యాల మధ్య కొనసాగుతున్న గందరగోళం కారణంగా ఇన్వెస్టర్లు తమ పొజిషన్స్‌ కొనసాగించడానికి ఇష్టపడలేదు. దివీస్ ల్యాబ్‌ ఇవాళ రెండు శాతం క్షీణించడం విశేషం.