వీటి ధరలు మళ్ళీ పెరిగాయి
హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) మరోసారి తన ఉత్పత్తుల ధరలను పెంచింది. తయారీ ఖర్చుల భారీగా పెరగడంతో ధరలు పెంచక తప్పడం లేదని సంస్థ తెలియజేసింది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా ఆయా కంపెనీ తన ఉత్పత్తుల ధరలు పెంచడం ఇది అయిదోసారి.ఈ ఏడాది ఇది రెండోసారి. లక్స్, రెక్సోనా, పాండ్స్ టాల్కమ్ పౌడర్, సర్ఫ్ ఎక్సెల్, విమ్ బార్, లిక్విడ్ ధరలు 3 నుంచి 10 శాతం మేర పెంచినట్లు కంపెనీ పేర్కొంది. జనవరిలో వీల్ డిటర్జెంట్, రిన్ బార్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్‌బాయ్, పియర్స్ ధరలను హెచ్‌యూఎల్ 3-20 శాతం మేర పెంచింది. గత ఏడాది సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్‌లలోనూ ఈ ఉత్పత్తుల ధరలు పెరగగా, తాజా నిర్ణయంతో వరుసగా అయిదోసారి ధరలు పెరిగినైట్టెంది.