NSE మాజీ ఛైర్మన్ ఇంటిపై ఐటీ దాడులు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) మాజీ ఛైర్మన్ చిత్రా రామకృష్ణ ఇంటిపై ఉదయం నుంచి ఆదాయ పన్ను అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. స్టాక్ ఎక్స్ఛేంజీకి చెందిన కీలక సమాచారాన్ని హిమాలయాల్లో ఉన్న ఓ యోగికి చేర వేసినందుకు చిత్ర రామకృష్ణ పై స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి భారీ మొత్తం జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఎన్ఎస్ఈకి చెందిన సమాచారం ఇవ్వడమేగాక.. యోగి చెప్పినట్లు ఆఫీసులో చాలా మంది ప్రమోషన్లు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ ప్యాకేజీ కూడా ఇచ్చారని సెబీ తన దర్యాప్తు నివేదికలో స్పష్టం చేసింది.సంస్థలో చిత్ర రామకృష్ణ నియమించిన మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్ ఇంటిపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి.