హాల్దియా పెట్రో చేతికి కోస్టల్ ఆయిల్
దివాలా తీసిన కోస్టల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీని హాల్దియా పెట్రోకెమికల్ కొనుగోలు చేయనుంది. తాను నెలకొల్పదలిచిన పెట్రో కెమికల్ రిఫైనరీ కోసం నాగార్జునా ఆయిల్ కార్పొరేషన్ కోస్టల్ ఆయిల్‌ను నెలకొల్పింది. గత ఏడాది నాగార్జున ఆయిల్‌ఉన హాల్దియా పెట్రోకెమిల్‌ను టేకోవర్ చేసింది. కోస్టల్ టేకోవర్ కోసం హాల్దియా వేసిన బిడ్‌కు రుణదాతలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో…నేషనల్ కంపెనీ లా ట్రైబ్యూనల్ అమరావతి బెంచ్ ఓకే చేసింది. కోస్టల్ ఆయిల్‌ను టేకోవర్ చేసేందుకు రెండు బిడ్లు వచ్చాయి. బిడ్ రిజర్వ్ ధర రూ. 36.46 కోట్లు కాగా, అత్యధిక మొత్తం రూ.37.5 కోట్లకు హాల్దియా బిడ్ వేసింది. రుణదాతలు హాల్దియా బిడ్‌కు సరేనన్నాయి.