For Money

Business News

క్రిప్టో మైనింగ్‌పై 18% జీఎస్టీ?

క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్‌పై ఆర్థిక శాఖ రెండు రకాల పన్నులను విధించింది. క్రిప్టో కరెన్సీని కొన్నా, అమ్మినా ఒక శాతం టీడీఎస్‌ కట్టాల్సి ఉంటుంది. ఇక వచ్చిన లాభాల్లో 30శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. మరి నష్టాలు వస్తే… ఇతర లాభాలకు అడ్జస్ట్‌ చేయొచ్చా అన్నది ఇంకా తెలియలేదు. ఇది ఇలా ఉండగానే…క్రిప్టో లావాదేవీలపై బాదుడుకు జీఎస్టీ కౌన్సిల్‌ రెడీ అవుతోంది. రానున్న కౌన్సిల్‌ సమావేశంలో క్రిస్టో ఎక్స్ఛేంజీల్లో జరిగే లావాదేవీలపై, క్రిప్టో కరెన్సీ మైనింగ్‌ ప్లాట్‌ఫామ్‌లపై కూడా జీఎస్టీ విధించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ లావాదేవీలపై పన్ను విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండైరెక్ట్‌ ట్యాక్సస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) ఛైర్మన్‌ వివేక్‌ జోషి వెల్లడించారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయని..త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.