గెస్ట్ లెక్చర్ ఆదాయంపై 18% జీఎస్టీ
గెస్ట్ లెక్చర్ ఇవ్వడం ద్వారా సంపాదించిన ఆదాయంపై 18 శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఆర్ఆర్) కర్ణాటక బెంచ్ స్పష్టం చేసింది. ఈ అంశంపై స్పష్టత కోసం సాయిరామ్ గోపాలకృష్ణ భట్ అనే వ్యక్తి ఏఆర్ఆర్ని ఆశ్రయించారు. గెస్ట్ లెక్చర్ ఇవ్వడం అనేది ప్రొఫెషనల్, టెక్నికల్, బిజినెస్ సర్వీస్ కిందకు వస్తుందని… దీని ద్వారా సంపాదించిన ఆదాయంపై 18 శాతం జీఎస్టీ కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ఇపుడున్న నిబంధనల ప్రకారం రూ. 20 లక్ష వార్షిక టర్నోవర్ దాటినవారు జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. ఈ స్థాయి ఆదాయం ఉన్నవారు గెస్ట్ లెక్చర్ ద్వారా ఆదాయం సంపాదిస్తే… దానిపై 18 శాతం జీఎస్టీ కట్టాలని ఆర్ఆర్ఆర్ పేర్కొంది.