వాల్‌స్ట్రీట్ మళ్ళీ డౌన్
ఉక్రెయిన్ నుంచి రష్యా తన దళాలను ఉపసంహరించుకోలేదని, పైగా అదనంగా దళాలను మోహరిస్తున్నట్లు అమెరికా, నాటో దేశాలు ఆరోపించడంతో వాల్‌స్ట్రీట్ మళ్ళీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. పైగా అమెరికాలో రీటైల్ సేల్స్ గణాంకాలు బ్రహ్మాండంగా ఉండటంతో మార్చి నెలలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ఖాయమని సంకేతాలు వెలువడినట్లయింది. దీంతో కూడా వాల్‌స్ట్రీట్‌లో ప్రధాన సూచీలు నష్టాల్లో ఉన్నాయి. నాస్డాక్ ఒక శాతంపైగా నష్టంతో ఉండగా, డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీలు 0.6 శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. వయాకామ్ సీబీఎస్ కంపెనీ ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటంతో ఆ షేర్ 20 శాతం క్షీణించింది. అలాగే పేరును పారామౌంట్‌గా మార్చడం ఇన్వెస్టర్లకు నచ్చలేదు. కరెన్సీ మార్కెట్లో డాలర్ కాస్త బలహీనంగా ఉంది. ఉక్రెయిన్ యుద్ధ భయాలతో క్రూడ్ ధరలు మళ్ళీ పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 96 డాలర్లను తాకింది.