For Money

Business News

55 వేల మందిని తీసుకుంటాం

గ్లోబల్ గ్రాడ్యుయేట్ హైరింగ్ ప్రోగ్రాం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో 55 వేల మంది ఫ్రెషర్స్‌ను తీసుకుంటామని ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించారు. వీరిని తీసుకునే ప్రక్రియ రెండు నెలల్లో పూర్తవుతుందని అన్నారు. నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్ షిప్ ఫోరం 2022(ఎన్‌టిఎల్ఎఫ్)లో ఆయన మాట్లాడుతూ తాసు తీసుకునే ఫ్రెషర్స్‌ ఆరు నుంచి 12 వారాలపాటు శిక్షణ ఇస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా 55,000 ఉద్యోగులను తీసుకుంటున్నామని… వీరిలో 52,000 మంది ఇక్కడి వారేనని, మరో 3,000 మ౦దిని విదేశాల నుంచి తీసుకుంటున్నట్లు పరేఖ్ తెలిపారు. విద్యార్ధులు క్లౌడ్, డేటా అనాలిసిస్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఐఓటి వంటి కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలని పరేఖ్ సూచించారు. వ్యాపార పరంగా, పెద్ద క్లౌడ్ & డిజిటల్ సంస్థలు ఇప్పుడు ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి అని అన్నారు. కొత్తవారు ఎప్పటికపుడు కొత్త టెక్నాలజీని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. మూడు, అయిదేళ్ళకు ఒకసారి కొత్త స్కిల్స్‌ను నేర్చుకోవాలన్నారు.