For Money

Business News

ట్రూజెట్‌ విమాన సర్వీసులు నిలిపివేత

హైదరాబాద్‌కు చెందిన ట్రూజెట్‌ విమాన సంస్థ తన సర్వీసులను సస్పెండ్‌ చేసింది. కంపెనీ సీఈఓ, సీఎఫ్‌ఓ, సీసీఓ కూడా రాజీనామా చేశారు. కంపెనీకి ఏడు విమానాలు ఉండగా… వాయిదాలు చెల్లించకపోవడంతో… అద్దెకు ఇచ్చిన కంపెనీలు అయిదు విమానాలను తీసుకెళ్ళిపోయాయి. సర్వీస్‌ లైసెన్స్‌ ఉండాలంటే నిబంధనల ప్రకారం కనీసం అయిదు విమానాలు ఉండాలి. మరోవైపు తమ కంపెనీలోకి కొత్త ఇన్వెస్టర్‌ వస్తున్నాడని కంపెనీ అంటోంది. ప్రస్తుతం నిర్వహణ, సాంకేతిక సమస్యల కారణంగా సర్వీసులు ఆపుతున్నామని, త్వరలోనే ప్రారంభిస్తామని సీఎన్‌బీసీ టీవీ 18తో ట్రూజెట్‌ కంపెనీ పేర్కొంది. 2.5 కోట్ల డాలర్లతో కొత్త ఇన్వెస్టర్‌ వస్తారని, వారితో జరుగుతున్న చర్చలు తుది దశలో ఉన్నట్లు కంపెనీ అంటోంది. దీంతో కొత్త మేనేజ్‌మెంట్‌ ట్రూజెట్‌ను నిర్వహిస్తుందని పేర్కొంది. మార్చి 1వ తేదీ కల్లా కొత్త సీఈఓ వస్తారని కంపెనీ తెలిపింది.