For Money

Business News

MID SESSION: యూరో జోష్‌

ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి… ఆ వెంటనే వచ్చిన లాభాల స్వీకరణతో సుమారు 200 పాయింట్లు క్షీణించింది. ఉదయం 17440 పాయింట్లను తాకిన నిఫ్టి తరవాత 17257 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది. మిడ్‌ సెషన్‌లో యూరో ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉండటంతో నిఫ్టి దిగువ స్థాయి నుంచి కోలువడం ప్రారంభమైంది. యూరో మార్కెట్లు ఇవాళ కూడా ఆక్షణీయ లాభాలో ప్రారంభం కావడంతో నిఫ్టి ఊపందుకుని మళ్ళీ ఉదయం గరిష్ఠ స్థాయిని దాటింది.17490ని తాకిన తరవాత ఇపుడు 17473 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి 121 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. మిగిలిన సూచీలు కూడా ఇదే స్థాయి లాభాలతో ట్రేడవుతున్నాయి. దివీస్‌ ల్యాబ్‌ నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది.