For Money

Business News

భారత మార్కెట్‌లోకి కియా కరెన్స్‌

సెవెన్-సీటర్ యుటిలిటీ వెహికల్ (ఎంపీవీ) కియా కరెన్స్‌ను భారత మార్కెట్లలోకి కియా మోటార్స్‌ ప్రవేశపెట్టింది. సెల్టోస్, కార్నివాల్, సోనెట్ తర్వాత ఈ కారును కియా తీసుకువచ్చింది. ఈ కారును ఏపీలోని కియా ప్లాంట్‌లో తయారు చేస్తోంది. ఇక్కడి నుంచే విదేశాలకు కూడా ఈ మోడల్‌ను ఎగుమతి చేయనుంది. హై ఎండ్‌ డిజైన్‌తో ఈ కారును రూపొందించారు. ఈ కారులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.5-అంగుళాల డిజటల్‌ క్లస్టర్‌, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 8 స్పీకర్ల బాస్‌ సౌండ్‌ సిస్టమ్‌ 360-డిగ్రీ కెమెరాలు అమర్చారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్‌, ఈఎస్‌ఈ, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఫ్రంట్ , రియర్ పార్కింగ్ సెన్సార్ల ద్వారా కారులో ప్రయాణించే వారికి మరింత భద్రతను కరెన్స్‌ అందిస్తోంది.
మొదలైన ప్రి బుకింగ్స్‌
కియా కరెన్స్‌ను ప్రి-బుకింగ్స్‌ను కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. కారు ధర రూ. 8.99 లక్షల నుంచి రూ. 16.99 లక్షల వరకు ఉంది. ఈ కారు మొత్తం ప్రీమియం, ప్రెస్టిజ్‌, ప్రేస్టిజ్‌ప్లస్‌, లగ్జరీ, లగ్జరీ ప్లస్‌ అనే ఐదు రకాల వేరియంట్లలో రానుంది.