ఎలాన్ మస్క్: ఛారిటీకి రూ.41000 కోట్లు
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గత నవంబర్ నెలలో 50,44,000 షేర్లను ఓ చారిటీ సంస్థకు విరాళంగా ఇచ్చారు. వీటి విలువ 553 కోట్ల డాలర్లు అంటే రూ. 41000 కోట్లపైనే ఉంటుందని అంచనా. ఈ మేరకు ఆయన అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్కు తెలిపారు. అయితే ఈ విరాళం ఏ సంస్థకు ఇచ్చింది మాత్రం ఆయన వెల్లడించలేదు. గత ఏడాది ఆయన 1640 కోట్ల డాలర్ల విలువైన షేర్లను ఎలాన్ మస్క్ అమ్మిన విషయం తెలిసిందే. పన్నులు కట్టేందుకు తాను కొన్ని షేర్లు అమ్మాల్సి వచ్చిందని ఆయన అప్పట్లో వెల్లడించారు.