శాటిలైట్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్
దేశంలో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను అందించేందుకు రిలయన్స్ జియో రెడీ అవుతోంది. ఈ మేరకు లగ్జెంబర్గ్‌కు చెందిన శాటిలైట్ ఆధారిత కంటెంట్ కనెక్టివిటీ సర్వీస్ సంస్థ ఎస్ఈఎస్తో ఒప్పందం చేసుకుంది. ఈ రెండు కంపెనీలు కలిసి జియో స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్ పేరుతో కొత్త కంపెనీని ఏర్పాటు చేశాయి. ఇందులో జియో ప్లాట్‌ఫామ్స్ (జేపీఎల్)కు 51 శాతం, ఎస్ఈఎస్కు 49 శాతం ఈక్విటీ వాటా ఉంటుంది. దేశంలో ఎస్ఈఎస్ ఉపగ్రహ డేటా, కనెక్టివిటీ సేవలను అందించడానికి ఈ జేవీ దోహదపడుతుంది. శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ఎయిర్టెల్ కంపెనీలు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాయి. జియో, ఎస్ఈఎస్ జాయింట్ వెంచర్ 100 జీబీపీఎస్ వరకు సామర్థ్యంతో ఇంటర్నెట్ సేవలను అందించడానికి అవకాశం ఉంటుంది.