For Money

Business News

2 రోజుల్లో రూ.10 లక్షల కోట్ల విలువ పాయే

స్టాక్‌ మార్కెట్‌లో ఇవాళ సునామీలో వచ్చిన పతనంతో అనేక మంది ఇన్వెస్టర్ల సంపద భారీగా తగ్గింది. గత శుక్రవారం, ఇవాళ అంటే.. రెండు రోజుల్లో బీఎస్‌ఈలో లిస్టయిన షేర్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఏకంగా రూ.10 లక్షల కోట్లు తగ్గింది. అంటే ఆ షేర్లు విలువ తగ్గింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఖాయమంటూ వస్తున్న వార్తలతో ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్లను తెగ అమ్ముకున్నారు.శుక్రవారం 1.3 శాతం, ఇవాళ రెండు శాతం చొప్పున నిఫ్టీ క్షిణించింది. అనిశ్చితి కారణంగానే ఇన్వెస్టర్లు మార్కెట్‌ నుంచి వైదొలగుతున్నారని అనలిస్టులు అంటున్నారు. డాలర్‌ పెరుగుతున్నందున ఐటీ,ఫార్మా వంటి ఎగుమతి ప్రధాన పరిశ్రమలకు చెందిన షేర్లు మినహా మిగిలిన పరిశ్రమల షేర్లలో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఈనెల పదిన బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.267.81 లక్షల కోట్లు కాగా..ఇవాళ క్లోజింగ్‌ సమయానికి రూ. 258.24 లక్షల కోట్లకు పడిపోయింది.