ఉక్రెయిన్ దెబ్బకు మార్కెట్ మటాష్
అన్ని కట్టలు తెగినట్లు… అన్ని మద్దతు స్థాయిలూ కోల్పోవడంతో నిఫ్టి పతనాన్ని ఎవరూ ఆపలేకపోయారు. ఉదయం నుంచి నిఫ్టి కోలుకున్న ప్రతిసారీ భారీ ఎత్తున ఒత్తిడి వచ్చింది. ఉదయం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని అన్నట్లు… నిఫ్టి పెరిగితే.. దాన్ని అమ్మడానికి ఛాన్స్‌గా వాడుకోవాలన్నారు. అలాగే నిఫ్టి పెరిగినపుడల్లా అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఉదయం భారీ నష్టాల నుంచి కోలుకుని 17,000పైకి వచ్చినా… మిడ్ సెషన్లో యూరో నష్టాలు …మన మార్కెట్‌ను సునామీలా తాకాయి. సరిగ్గా 1.30 గంటల వరకు 17,000పైన ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించి నిఫ్టి… తరవాత చేతులెత్తేసింది. ఏకంగా 16,809 పాయింట్లను తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 532 పాయింట్ల నష్టంతో 16842 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1747 పాయింట్లను కోల్పోయింది. నిఫ్టి మూడు శాతం నష్టపోతే… అత్యంత కీలకమైన బ్యాంక్, మిడ్ క్యాప్, ఎన్‌బీఎఫ్‌సీల నిఫ్టిలు నాలుగు శాతంపైగా నష్టపోయాయి. నిఫ్టిలో టీసీఎస్ ఒక్కటే కాస్త గ్రీన్‌లో కన్పించినా… మిడ్ క్యాప్ గుజరాత్ గ్యాస్ గ్రీన్లోకన్పించింది… నిఫ్టి నెక్ట్స్, బ్యాంక్ నిఫ్టి షేర్లలో ఒక్క షేరు కూడా గ్రీన్‌లో లేదు.