ఆగనంటున్న అదానీ షేర్
అదానీ గ్రూప్ నుంచి తాజాగా లిస్టయిన అదానీ విల్మర్ షేర్ పరుగు ఆగడం లేదు. నిన్నటి దాకా రోజూ 20 శాతం పెరిగిన ఈ షేర్ ఇవాళ పది శాతం లాభం ఆర్జించింది. ఇవాళ్టి నుంచి ఈ షేర్‌లో గరిష్ఠ మార్జిన్‌ను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. దీంతో ఇవాళ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ఉన్నా ఈ షేర్ మాత్రం రూ.415ని తాకింది. ఇపుడు రూ. 144.70 వద్ద 6.5 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఈనెల 8న అంటే రూ.227 వద్ద ట్రేడైన షేర్ ఇవాళ రూ. 415ని తాకింది. నాలుగు సెషన్స్‌లో ఈ స్థాయిలో లాభాలు ఆర్జించిన షేర్లలో ఇదొక్కటే అని చెప్పొచ్చు. ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుత ధర వద్ద షేర్ల సప్లయ్ బాగానే ఉంది. నిన్న, ఇవాళ డెలివరీస్ 25 శాతం కూడా దాటడం లేదు.