17,400 దిగువకు నిఫ్టి
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే మన మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఓపెనింగ్‌లో నిఫ్టి 17,454ని తాకినా.. కొన్ని క్షణాల్లోనే 17,391ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 189 పాయింట్ల నష్టంతో 17,417 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టితో పాటు బ్యాంక్ నిఫ్టి కూడా ఇదే స్థాయి నష్టాలతో ట్రేడవుతోంది. అయితే మిడ్ క్యాప్ నిఫ్టి సూచీ మాత్రం కేవలం అరశాతం నష్టంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నాయి. ప్రతి 5 షేర్లలో నాలుగు షేర్లు నష్టాల్లో ఉన్నాయి. పీబీ ఫిన్‌టెక్ 6 శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. ఫలితాలు ప్రకటించిన జొమాటో కూడా ఆరు శాతం నష్టపోయింది. వారం ప్రారంభంలో లిస్టయిన అదానీ విల్మర్ మాత్రం ఇవాళ మరో ఆరు శాతం పెరిగి రూ. 402 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టిలో నష్టాల్లో ఉన్న షేర్లలో ఐటీ షేర్లు ముందున్నాయి.