For Money

Business News

NIFTY TRADE: 17,491 దిగువన కష్టాలు

విదేశీ ఇన్వెస్టర్లు నిన్న కూడా క్యాష్‌ మార్కెట్‌లో భారీగానే అమ్మకాలు చేశారు. వీరి ట్రేడింగ్‌ అధికంగా ఫ్యూచర్స్, ఆప్షన్స్‌లో ఉంది. నిన్నటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు 17,400 పుట్‌ ఆప్షన్స్‌ రైటింగ్‌ జోరుగా చేశారు. మరి ఈ స్థాయి మార్కెట్‌కు గట్టి ఉంటుందని అనుకున్నామని, కాని ఇపుడు వారి తదుపరి కదలికలు గమనించాల్సి ఉందని స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ వీరేందర్‌ అంటున్నారు. 17,523-17,491 (50రోజుల/20రోజుల DEMA జోన్‌) దిగువకు వస్తే నిఫ్టిపై ఒత్తిడి పెరుగుతుందని ఆయన అంటున్నారు. 17410-17368 కూడా మార్కెట్‌కు చాలా గట్టి బేస్‌ను ఇస్తున్నాయని.. దీనిపైన షార్ట్‌ చేయొద్దని ఆయన సలహా ఇస్తున్నారు. అంటే ఈ స్థాయి దిగువకు చేరితేనే నిఫ్టి ఇంకా బలహీనపడే అవకాశముంది. ఇక ఇవాళ్టికి ఆయన ఇచ్చిన నిఫ్టి లెవల్స్‌… తొలి మద్దతు 17,523, రెండో మద్దతు 17,491 వద్ద లభించవచ్చు. లేదంటే 17,410కు చేరే అవకాశముంది. బ్యాంక్‌ నిఫ్టితో పాటు మరిన్ని లెవల్స్‌ కోసం వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=YmiOIvVMnsQ