For Money

Business News

76 శాతం పెరిగిన కిమ్స్‌ లాభం

హైదరాబాద్‌కు చెందిన కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌ హాస్పిటల్స్‌) డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి రూ.84.2 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. 2020లో ఇదే త్రైమాసికంలో ఆర్జించిన నికర లాభం రూ.47.8 కోట్లతో పోల్చితే ఇది 76 శాతం అధికం. మొత్తం ఆదాయం మాత్రం 10 శాతం వృద్ధితో రూ.360.8 కోట్ల నుంచి రూ.396 కోట్లకు పెరిగింది. త్రైమాసిక ఈపీఎస్‌ రూ. 6.45 నుంచి రూ. 10.14కు పెరిగినట్లు కంపెనీ తెలిపింది. అదే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9 నెలల కాలానికి రూ.1,290.6 కోట్ల ఆదా యంపై రూ.260.5 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం హాస్పిటల్‌ ఆదాయం కోవిడ్‌కు ముందు స్థాయికి చేరాయని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి. భాస్కరరావు అన్నారు. హాస్పిటల్‌లోని న్యూరో సైన్స్‌ విభాగం ఈ త్రైమాసికంలో 1000కిపైగా ఎపిలెప్సీ శస్త్రచికిత్సలు చేసినట్లు ఆయన వెల్లడించారు.