NIFTY TRADE: కొనండి కానీ…
ఆర్బీఐ పాలసీకి ముందు లేదా తరవాత నిఫ్టిలో పతనం వస్తే… కొనుగోలుకు ప్రయత్నించండి. కాని 17380 కీలక స్టాప్‌లాస్‌గా ఉంచుకోవాలని వీరేందర్ సలహా ఇస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు తగ్గించారు. అలాగే ఎఫ్ అండ్ ఓ విభాగంలో దాదాపు రూ. 5000 కోట్లకు పైగా కొనుగోళ్ళు చేశారు. అయితే నిఫ్టిని పడినపుడే కొనమని వీరేన్ సలహా ఇస్తున్నారు.అలాగే నిఫ్టి పెరిగితే తొలి ప్రతిఘటన 17510 వద్ద లేదా 17538 వద్ద రావొచ్చని అంటున్నారు. ఒకవేళ పాలసీ బాగుండి.. మార్కెట్ నుంచి గట్టి మద్దతు లభిస్తే నిఫ్టి 17600ని కూడా క్రాస్ చేయొచ్చు. ఒకవేళ నిఫ్టి పడితే తొలి మద్దతు 17380 ప్రాంతంలో అదాలి లేదా 17345 ప్రాంతంలో. 17300 దిగువకు వెళితే 17258ని కూడా తాకే అవకాశముంది. ఇవాళ ఆర్బీఐ క్రెడిట్ పాలసీతో పాటు వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కూడా ఉంది. మరిన్ని వివరాలకు దిగువ ఉన్న వీడియో చూడండి.