For Money

Business News

వాల్‌స్ట్రీట్‌కు టెక్‌ షేర్ల అండ

వాల్‌స్ట్రీట్‌లో ర్యాలీ కొనసాగుతోంది. ఒక మోస్తరు లాభాలతో సాగుతున్న ర్యాలీకి ఇవాళ గట్టి మద్దతు లభించింది. టెక్‌ షేర్ల అండతో నాస్‌డాక్‌తో పాటు ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ ఒక శాతంపైగా పెరిగాయి. ఇక డౌజోన్స్‌ కూడా 0.8 శాతం పెరిగింది.మరోవైపు యూరో మార్కెట్లు కూడా దూసుకుపోతున్నాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ 1.77 శాతం లాభంతో ఉంది. ప్రధాన మార్కెట్లన్నీఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఇక కరెన్సీ మార్కెట్‌లో డాలర్ బలహీనపడింది. 10 ఏళ్ళ ట్రెజరీ బాండ్స్‌ ఈల్డ్‌ కూడా తగ్గుముఖం పట్టాయి. డాలర్‌ బలహీన పడినా అదే స్థాయిలో బులియన్‌ పెరగలేదు. నామమాత్రపు లాభాలకే పరిమితమైంది. కాని ఆయిల్‌ దూసుకుపోతోంది. బ్రెంట్‌ క్రూడ్‌ మళ్ళీ 92 డాలర్లను దాటింది.