NIFTY TRADE: రేంజ్‌లోనే ఉంటుంది
మార్కెట్‌లో పెద్ద మార్పులు ఉండవని, నిఫ్టి ఒక రేంజ్‌లో ట్రేడ్ అవుతుందని అనలిస్ట్ వీరేందర్ అంటున్నారు. నిఫ్టి 17361 స్థాయిని దాటి బలంగా ముందుకు సాగితేనే షార్ట్ కవరింగ్ వస్తుందని లేకుంటే …బలహీన పడుతుందని అంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఏమాత్రం ఆగడం లేదు. అలాగే ఫ్యూచర్స్, ఆప్షన్స్‌లో కొనుగోళ్ళు తగ్గడం లేదు. నిఫ్టి అధిక స్థాయిలను తట్టుకుని ముందుకు సాగేంత వరకు అనిశ్చితి ఉంటుందని వీరేందర్ అంటున్నారు. హెచ్చతుగ్గులు అధికంగా ఉన్నా… క్లోజింగ్‌కు వచ్చేసరికల్లా కొద్ది పాయింట్లు లాభనష్టాలతో నిఫ్టి ముగుస్తుంది. 17000 ఉన్న నిఫ్టిలో వంద పాయింట్ల మార్పు పెద్ద అంశం కాదు. కాబట్టి పొజిషనల్ ట్రేడర్స్‌కు పెద్ద భయం లేకున్నా… డే ట్రేడర్స్‌కు మంచి అవకాశమమే. బ్యాంక్ నిఫ్టి లెవల్స్ కోసం వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=EcHeyeLwZBA