2 వారాల గరిష్ఠ స్థాయికి
ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు రష్యా-ఉక్రెయిన్ ఘర్షణ కారణంగా బులియన్ కాస్త పటిష్ఠంగా కన్పిస్తోంది. మార్చిలో అరశాతం మేరకు వడ్డీ రేట్లను ఫెడరల్ రిజర్వ్ పెంచుతుందన్న వార్తలతో బులియన్‌కు డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1827 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్ స్థిరంగా ఉండటంతో బులియన్ రేట్లలో ఇవాళ పెద్దగా కదలికలు లేవు. ఇక వెండి కూడా 23.27 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఫ్యూచర్ మార్కెట్…
నిన్న అమెరికా మార్కెట్లు ప్రారంభమయ్యేంత వరకు నష్టాల్లో ఉన్న బులియన్ మార్కెట్ రాత్రి లాభాల్లో ముగిసింది. ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ఫిబ్రవరి కాంట్రాక్ట్‌లో పెద్ద మార్పు లేదు. రాత్రి రూ.198 పెరిగి రూ. 48,426 వద్ద ముగిసింది. వెండి మార్చ్ కాంట్రాక్ట్ మాత్రం రూ.335 పెరిగి రూ. 62370 వద్ద ట్రేడవుతోంది. ఇక హైదరాబాద్ స్పాట్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 200 పెరిగి రూ. 45400 వద్ద ఉంది. 24 క్యారెట్ల స్టాండర్డ్ బంగారంరూ.230 పెరిగి రూ. 49,530 వద్ద ముగిసింది. వెండిలో పెద్ద మార్పు లేదు. కిలో రూ. 65100 ప్రాంతంలో ట్రేడవుతోంది.