167 శాతం పెరిగిన IRCTC నికరలాభం
కరోనా కాలంలో బక్కచిక్కిన 2020 త్రైమాసికంతో పోలిస్తే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈసారి మెరుగైన ఫలితాలు సాధించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 208 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2020 డిసెంబర్‌లోని రూ. 78 కోట్లతో పోలిస్తే నికర లాభం 167 పెరిగినట్లు. అదే గత సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 32 శాతం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తె కంపెనీ ఆదాయం 141 శాతం పెరిగి రూ. 224 కోట్ల నుంచిరూ. 540 కోట్లకు చేరింది. కంపెనీ ఆదాయం 58 శాతం మొత్తం ఇంటర్నెట్ టికెట్ బుకింగ్ ద్వారా వచ్చిందే. కేటరింగ్ ద్వారా మరో రూ. 104 కోట్ల ఆదాయం వచ్చింది.