For Money

Business News

గ్రీన్‌లో ముగిసిన నిఫ్టి

మిడ్‌ సెషన్‌కు ముందు ఇవాళ్టి ప్రధాన రెండో మద్దతు స్థాయిని నిఫ్టి తాకింది. 17.043ని తాకిన తరవాత అక్కడి నుంచి కోలుకుంది. తొలి మద్దతు స్థాయి వద్ద (17082) మద్దతు అందకపోవడంతో నిఫ్టి భారీగా క్షీణించింది. అమెరికాతో పాటు యూరప్‌ ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉండేసరికి క్రమంగా కోలుకుని… యూరో మార్కెట్ల ఓపెనింగ్‌కల్లా లాభాల్లోకి వచ్చింది. కాని కొద్ది సేపటికే నష్టాల్లో జారుకుంది. చాలా సేపు నష్టాల్లో ఉన్న మార్కెట్‌ సరిగ్గా 3 గంటల స్క్వేర్‌ ఆఫ్‌ టైమ్‌లో గ్రీన్‌లోకి వచ్చింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 53 పాయింట్ల లాభంతో 17,266 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 187 పాయింట్లు లాభపడింది. ఇవాళ క్యాపిటల్‌ గూడ్స్‌, పవర్‌ షేర్లకు మద్దతు లభించింది. బ్యాంక్‌ నిఫ్టి క్రితం స్థాయి వద్దే ముగియగా, మిడ్ క్యాప్‌ నిఫ్టి 0.7 శాతం, నిఫ్టి నెక్ట్స్‌ 0.47 శాతం నష్టంతో ముగిశాయి. నిఫ్టిలో 28 షేర్లు గ్రీన్‌లో క్లోజ్‌ కాగా, 22 నష్టాల్లో ముగిశాయి.