ఇవాళ్టి ట్రేడింగ్… టెక్నికల్స్
ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు మాత్రమే అమ్మేవారు. తొలిసారి నిన్న దేశీయ ఆర్థిక సంస్థలు కూడా భారీగా అమ్మాయి. దాదాపు రూ.1373 కోట్లకు పైగా నికర అమ్మకాలుఉ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లు మన మార్కెట్‌కు ఏమాత్రం దోహదం చేసేలా లేవు. ఇపుడు విదేశీ ఇన్వెస్టర్లతో పాటు దేశీయ ఆర్థిక సంస్థలు కూడా అమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తారా అన్నది చూడాలి. ఎఫ్ అండ్ ఓ డేటా పరిశీలిస్తే… లాంగ్ అన్‌వైండింగ్ జరుగుతోంది. అంటే లాంగ్ పొజిషన్స్ తీసుకున్నవారు బయటపడుతున్నారు. సెంటిమెంట్ చాలా నెగిటివ్‌గా ఉంది.
ఇక సాంకేతికంగా చూస్తే… టెక్నికల్స్ కూడా కీలక స్థాయిలను పరీక్షిస్తున్నాయి. 50 రోజుల చలన సగటు 17442 కాగా, 100 రోజుల చలన సగటు 17646. ఈ రెండు కీలక లెవల్స్ దిగువ నిఫ్టి ట్రేడవుతోంది. అలాగే బ్యాంక్ నిఫ్టికి 50 రోజుల చలన సగటు 36953 కాగా, 100 రోజుల చలన సగటు 37716. కాబట్టి నిఫ్టి కనీసం 50 రోజుల చలన సగటు దాటే వరకు వెయిట్ చేయడం మంచిది.