NIFTY TODAY: 17,290 కీలకం
మార్కెట్ ఇవాళ స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్‌కు ఇపుడు ట్రిగ్గర్స్ ఏవీ లేవు. అంతర్జాతీయంగా కూడా మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. భారీగా పడిన సూచీలు పెరగడం తప్ప… ఆశాజనక వార్తలు లేవు. ఈ నేపథ్యంలో నిఫ్టిలో పొజిషన్స్ తీసుకోవడం కంటే పెరిగినపుడు అమ్మడమే బెటర్. చిన్న ఇన్వెస్టర్లు నిఫ్టి నిలదొక్కుకునేంత వరకు మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిది. న్యూ ఏజ్ షేర్లకు బదులు.. ఫండమెంటల్స్ పరంగా స్థిరంగా ఉండి.. కాస్త డివిడెండ్ ఇచ్చే కంపెనీలను ఎంచుకోవడం బెటర్. ఇక ఇవాళ్టి డే ట్రేడింగ్‌కు నిఫ్టి లెవల్స్ ఇవి…
అప్ బ్రేకౌట్…17460
రెండో ప్రతిఘటన…17391
తొలి ప్రతిఘటన…17346
నిఫ్టికి కీలకం… 17290
తొలి మద్దతు…17082
రెండో మద్దతు… 17036
డౌన్ బ్రేకౌట్…16967
సాంకేతికంగా సూచీలు సెల్ సిగ్నల్ ఇస్తున్నాయి. కాని నిఫ్టి పెరిగినపుడు అమ్మడం బెటర్. నిఫ్టి 17600 దాటే వరకు కొనుగోళ్ళ జోలికి వెళ్ళొద్దు.